Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఎంతో పేరు తెచ్చుకుంది నటి రమ ప్రభ. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు సంపాదించింది. అయితే ఈమె కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలు చేసింది . ఒకప్పటి హీరో విలక్షణ నటుడైన శరత్ బాబును లవ్ చేసి పెళ్లి చేసుకుంది. దీంతో అతని చేతిలో మోసపోయి చివరికి తాను సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్ననని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రమాప్రభ. చివరికి కట్టుబట్టలతో రోడ్డున పడితే రజనీకాంత్ ఆదుకున్నారని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లోనే నాకు 40 వేల రూపాయలు ఇచ్చారని తెలియజేసింది.
Advertisement
Also Read;తారకరత్న చికిత్సకు డబ్బులు ఎవరి ఇస్తున్నారో తెలుసా..?
Advertisement
ఏదో ఖర్చులకు, తినడానికి కాస్త డబ్బు కోసం రజనీ ఇంటికి వెళ్లిన రమాప్రభకు అంత డబ్బు ఇవ్వడంతో షాక్ అయిందట.. రజనీకాంత్ ఇప్పటికి కూడా అదే విధంగా సాయం చేస్తుంటారని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈమె సినిమాలో నటించే టైంలో తప్ప ఎక్కువగా హైదరాబాదులో ఉండటం లేదని తెలిపింది. ఇక ఇటీవల ఈమె పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తినడానికి తిండి కూడా లేక పస్తులు ఉంటుందని అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదని రమాప్రభ చెప్పుకొచ్చింది. నేను అడుక్కుతింటున్నారని చాలామంది ప్రచారం చేస్తున్నారు.
నా సొంత యూట్యూబ్ ఛానల్ లో నా ఇల్లు ఏ విధంగా ఉందో చూపించాను. నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎలా అడుక్కు తింటానని తెలియజేసింది. చిరు, నాగార్జున వంటి వారు నాకు ఇప్పటికీ సాయం చేస్తున్నారని, వారు తమ ఇంట్లో మనిషి అనుకోని సాయం చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఇది అడుక్కు తినడం ఏ విధంగా అవుతుందని , నాపై వారికి ఉన్న ప్రేమతో సాయం చేస్తున్నారని తెలియజేసింది.
Also read; శివా చిత్రంలో జేడీ పాత్రలో ముందు ఆ నటుడిని అనుకున్నారా..?