Advertisement
చిత్ర పరిశ్రమ ఎంతో గొప్ప నైనది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు. అయితే అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళు పాతుకుపోయిన వారిలో టాలీవుడ్ కు చెందిన నటులు ఎంతోమంది ఉన్నారు. వయసు పైబడి సినిమాలకు దూరంగా కొంతమంది ఉండగా, మరి కొంతమంది మాత్రం 70 ఏళ్ళు పైబడినప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు.
Advertisement
అయితే, కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. అవును ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. పలు సీరియల్స్ లో చేసి, దివానా అనే సినిమా ద్వారా వెండితెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్ లోనే శక్తివంతమైన హీరోగా వెలుగొందాడు.
Advertisement
ఆ తర్వాత మనం ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ లో మానవ్ అనే క్యారెక్టర్ చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని అనూహ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ప్రముఖ దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ సైతం టీవీ నుంచే సినిమాలోకి రావడం విశేషం. అనంతరం హాలీవుడ్ లోనూ తిరుగులేని నటుడిగా ఎదిగాడు. చాణక్య, చంద్రకాంత లాంటి 10 టాప్ సీరియల్స్ లో ఆయన నటించారు.
ఇక మొత్తం ఇండియా సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ నటుడు ప్రకాష్ రాజ్. ఇతను కూడా మొదట నాటకాలు, సీరియల్స్ లో నటించాక సినిమా అవకాశాలు ఈయనని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక సంతోషం చిత్రంలో నాగార్జున సరసన నటించిన గ్రేసి సింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఈమె కూడా ‘అమానత్’ అనే సీరియల్ ద్వారా యాక్టింగ్ రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. ఈమె కూడా సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా టాప్ హీరోగా గుర్తింపు పొందిన యష్ కూడా మొదట సీరియల్స్ లో నటించాడు. తన భార్య రాధిక కూడా సీరియల్ నటి అన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి : చిన్న లాజిక్ తో పాకిస్తాన్ ను చీట్ చేసిన మహేంద్ర సింగ్ ధోని !