Advertisement
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో బంగార్రాజు పేరుతో పార్ట్ 2 కూడా తీశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. పార్ట్ 2 లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే నాగార్జున ఇందులో తండ్రి అలాగే కొడుకు పాత్రలో నటించారు. ఒక నాగార్జున పక్కన రమ్య కృష్ణ నటించారు.
అలాగే సంపత్ కూడా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించారు. నాగ చైతన్య… నాగార్జున మరియు రమ్యకృష్ణల మనవడి పాత్రలో నటించారు. అంటే రాము మరియు సీత కొడుకు ఈ చిన్న బంగారు రాజు అన్న మాట. ఈ లెక్కన రెండవ నాగార్జున పాత్ర అయిన రాము పక్కన నటించిన లావణ్య త్రిపాటి… నాగచైతన్య తల్లి అవుతుంది. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి అంతకుముందు యుద్ధం-శరణం సినిమా లో హీరో హీరోయిన్లుగా నటించారు.
ఆ సినిమా కంటే ముందు మనం సినిమాలో ఇద్దరు స్నేహితులు గా కనిపిస్తారు. ఇలా లావణ్య త్రిపాటి నాగచైతన్యకు ఫ్రెండ్ గా.. హీరోయిన్ గా అలాగే నాగచైతన్య తల్లిగా కూడా కనిపించారు అన్నమాట. కాగా బంగారు రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Advertisement