Advertisement
ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొదట సినిమాపై భారీ అంచనాలు ఉన్న కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ తో విమర్శలు రాగా, టీజర్ పై వ్యతిరేకత రాగా సినిమాపై హైప్ పోయింది. ఇక మొన్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
Advertisement
READ ALSO : నటి శాలిని విడాకుల ఫోటోషూట్ వెనుక ఇంత విషాదం దాగి ఉందా..!!
Advertisement
అయితే ఈ ట్రైలర్ తో ఆది పురుష్ మరోసారి వివాదంలో నిలిచింది. ఆది పురుష్ ట్రైలర్స్, స్క్రీన్ షాట్స్ వాడటంతో పలువురు యూట్యూబర్స్ కి కాపీ రైట్ పడింది. కాగా, ఇప్పటి జనరేషన్ కు రామాయణం నీ అర్థం అయ్యేలా అందులోని మోరల్స్ ను పాటించేలా చెప్పాలని మేకర్స్ అనుకున్నారు. అందుకు విఎఫ్ఎక్స్ ను సాధనంగా వాడుకున్నారు. అవి రాజమౌళి సినిమాల్లో ఉండే రేంజ్ లో లేకపోయినా… జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 600 కోట్ల బడ్జెట్ పెట్టారని చాలాకాలం నుండి ప్రచారం జరుగుతుంది. అందులో విఎఫ్ఎక్స్ కోసమే రూ. 350 కోట్లు ఖర్చు చేశారని అంతా అంటున్న మాట. అయితే ఇందులో నిజం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. ఆది పురుష్ ను చాలా వరకు గ్రీన్ మ్యాట్ వేసి తీసేసారు. చాలా వరకు విఎఫ్ఎక్స్ పైనే ఆధారపడ్డారు. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 380 కోట్ల బడ్జెట్లోనే ఫినిష్ చేశారని తెలుస్తోంది. కానీ పైకి మాత్రం రూ. 600 కోట్లని చెబుతున్నారు.
READ ALSO : ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?