Advertisement
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆది పురుష్ పేరే వినపడుతోంది. ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఓం రావత్ ఈ సినిమాకి ఎంతో చక్కగా దర్శకత్వం వహించారు, ఈ సినిమా కోసం ఓం రావత్ మరియు చిత్ర యూనిట్ నెలల తరబడి నిద్రపోకుండా కూడా పనిచేశారు. అలానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించడం మనం చూసాం.
Advertisement
హిందూ సెంటిమెంట్ ని ఈ సినిమాలో వాడుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమా కోసం భారీగా ప్రమోట్ చేస్తున్నారు. పైగా రామదూత హనుమంతుడికి ప్రతి ధియేటర్లో కూడా ఒక సీటును కేటాయించాలని అనుకున్నారు. ఈ సినిమా టీజర్ గురించి వచ్చిన విమర్శలు, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరూ చూశాం. అయితే అలా టీజర్ అవడంతో ట్రైలర్ మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టారు.
ట్రైలర్ ని చక్కగా తీసుకొచ్చారు. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత మంచి హిట్ ని కొట్టలేదు. సాలిడ్ హిట్టు కొట్టి సుమారు 7 ఏళ్లు అయిపోయింది. బాహుబలి 2 తర్వాత రిలీజ్ అయిన రాధే శ్యామ్ కానీ సాహో సినిమా కానీ అభిమానుల్ని ప్రేక్షకులను నిరాశపరచాయి తప్ప హిట్ కాలేదు. రాధే శ్యామ్ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది మరి ఇప్పుడు రాబోతున్న ఆది పురుష్ సినిమా అయినా ప్రభాస్ కి మంచి హిట్ ని ఇస్తుందా.. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Advertisement
అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా గురించి స్పందించారు. సినిమా ఎలా ఉంది అనేది చెప్పారు. ఈ సినిమా మెప్పించలేదని ఉమర్ సంధు అన్నారు అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా భారీ డిజాస్టర్ అయిందని భారీ అంచనాలతో విడుదలైంది కానీ అంతలా సినిమా మెప్పించలేదని చెప్పారు.
పైగా ఈ సినిమాలో నటుల పర్ఫామెన్స్ చాలా దారుణంగా ఉందని చెప్పారు, ప్రభాస్ సినిమా లో నటించడానికి శిక్షణ తీసుకుంటే మంచిదని అన్నారు. అలానే సినిమా టార్చర్ అని చెప్పుకొచ్చాడు ఉమర్ సంధు. ప్రభాస్ కృతి కి ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అని కామెంట్ చేశాడు. కేవలం ఈ సినిమాకి 2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు, పైగా మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని కూడా అతను చెప్పాడు. భారీగా ఆకట్టుకునే అంశాలు ఏమి సినిమాలో లేవని ప్రభాస్ కృతి తో పాటు అందరి నటన కూడా ఘోరంగా ఉందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వార్తల కోసం:
ఎన్టీఆర్ సంతానంలో.. ఎంత మంది స్వర్గస్థులయ్యారో తెలుసా మీకు..?
రైలు పైకప్పుపై గుండ్రని ఆకారంలో ఈ మూతలు ఎందుకు ఉంటాయి..? వీటి వలన లాభం ఏమిటి..?