Advertisement
అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ఇండియా మొత్తం ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు అడవి శేష్. హీరోగా, రచయితగా వరుసగా హిట్ సినిమాలను అందిస్తున్నారు. 2010లో కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు అడవి శేష్. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతడే. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో అడివి శేష్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా క్షణం మూవీ ఆయనకి బ్రేక్ ఇచ్చింది. ఇక అనంతరం శశికిరణ్ దర్శకత్వం వహించిన గూడచారి సినిమా భారీ విజయం సాధించడంతో అడివి శేష్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Advertisement
Read also: “వాల్తేరు వీరయ్య” లో డైలాగ్ అక్కడ నుండి లేపేసారా..? ఇది అస్సలు ఊహించి ఉండరు..
ఇక అడవి శేషు నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 2. అంతకుముందు అడివి శేష్ నటించిన పాన్ ఇండియా మూవీ మేజర్ మంచి విజయం సాధించడంతో అదే జోష్ లో హిట్ 2 తో వచ్చిన అడివి శేష్ మరోసారి మంచి విజయాన్ని అందుకున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ పై అడివి శేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఫ్యామిలీ నుంచి కనీసం 10 మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారని.. ఇలాంటి పరిస్థితులలో బయటి నుంచి వచ్చిన వ్యక్తికి మంచి స్క్రిప్టు దక్కడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. అలాగే ఒక సినిమా ఫలితాన్ని తాను ఎలా తీసుకుంటాడో కూడా ఈ సందర్భంగా వివరించారు అడివి శేష్.
Advertisement
ఒక సినిమా ఫ్లాప్ అయితే తాను డిప్రెషన్ కి గురికానని.. అయితే చేసిన పొరపాట్ల గురించి పాజిటివ్ గా విశ్లేషించుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చాలాసార్లు స్క్రిప్ట్ విషయంలో దొర్లే తప్పులను కరెక్ట్ చేశానని తెలిపారు. ఆయన రైటింగ్ మొదలుపెట్టిన తరువాత నటించిన చివరి ఆరు చిత్రాలలో నాలుగు సినిమాలకి స్క్రిప్టు రాయడం లేదా సహకారం చేశానని తెలిపారు. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ కోసం చాలా కాలం ఎదురు చూసి విసిగిపోవడమే తాను రైటింగ్ లోకి రావడానికి ఒక కారణమని వెల్లడించారు. కానీ తనకే అన్నీ తెలుసని అనుకోనని.. సినిమా ఫెయిల్ అయితే ఎందుకలా జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు.
Read also: పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..