Advertisement
సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. అయితే ఈ సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా మనిషి ఎంత తెలుసుకోవచ్చో అంతే రీతిలో ఇబ్బందుల్లో పడే పరిస్థితి కూడా ఉంటుంది. చక్కని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి ఈ సామాజిక మాధ్యమాలు.
Advertisement
Read also: TOLLYWOOD ACTRESS LAYA: ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?
ముఖ్యంగా తెలియని వారితో స్నేహాలు చేసి.. పరిచయాలు ఏర్పరచుకొని చాలామంది యువతి, యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టడం, అసభ్యకర మెసేజీలను ఫార్వర్డ్ చేయడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. భర్త లేని సమయంలో సదరు మహిళకి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం వంటి ఘటనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.
Advertisement
కావలిలోని ఓ టీ దుకాణంలో పనిచేసే కళ్యాణ్ అనే యువకుడు.. ఇంస్టాగ్రామ్ లో ఓ యువతకి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం జరిగింది. దీంతో అతని అడ్రస్ సేకరించిన మహిళ అక్కడికి చేరుకొని సదరు యువకున్ని చెప్పుతో చితకబాదింది. నడిరోడ్డుపై యువకుడిని చెప్పుతో కొడుతూ.. పక్కన వాళ్ళు చెబుతున్న వినకుండా పదేపదే కొడుతూ తన కాళ్లు పట్టించుకుంది. కొద్దిరోజుల క్రితం ఇంస్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడని సదరు మహిళ ఆరోపించింది. నెల్లూరు నడిబొడ్డులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: లైఫ్ పాట్నర్తో గొడవపడ్డాక ఈ తప్పులు చేస్తున్నారా.? బంధం విడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..