Advertisement
ప్రస్తుతం నరేష్ టాలీవుడ్ లో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మా ఎన్నికల సమయంలో నరేష్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఇటీవలే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. నరేష్ వయసు 60 ఏళ్ళు దాటిపోగా, ఇప్పటికే రెండుసార్లు పెళ్లయి విడాకులు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా నటి పవిత్ర లోకేష్ కు కూడా కన్నడ నటుడుతో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు.
Advertisement

Naresh Pavitra Images
అయితే పవిత్ర లోకేష్ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్, పవిత్ర పెళ్లి వార్తలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ ఆలయంలో పూజలు జరిపించారు. దాంతో పెళ్లి కోసమే నరేష్ పవిత్రలు పూజలు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే నరేష్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు.
Advertisement

Naresh Pavitra Images
కాగా, పవిత్ర లోకేష్ వయసు 43 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య 19 సంవత్సరాల వయసు తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నరేష్ పవిత్ర కలిసి దాదాపు పది చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుండి ఇద్దరు కలిసే ఉంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
READ ALSO : ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి