Advertisement
టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్.. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే వీరు అధికారికంగా కూడా ప్రకటించేశారు. డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా తెలిపారు.
Advertisement
Read also: చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?
అయితే నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చే విషయంలో అన్ని విషయాలు క్లియర్ అయిపోవడంతో పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో నరేష్ – పవిత్రల పెళ్లి జరగదని కామెంట్ చేశారు. అంతేకాదు దేవుడిలాంటి కృష్ణ గారితో తనకి అక్రమ సంబంధం అంటగట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు రమ్య రఘుపతి. నరేష్ 1963 సంవత్సరంలో జన్మించారని. తాను 1982వ సంవత్సరంలో జన్మించానని తెలిపారు.
Advertisement
అంటే వీరిద్దరి మధ్య దాదాపుగా 20 సంవత్సరాల గ్యాప్ ఉందని రమ్య తెలిపారు. పెళ్లికి ముందు తన కంటే 12 సంవత్సరాల వయసు తక్కువ అని చెప్పి నరేష్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. అయితే పెళ్లికి ముందే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి వీరిద్దరి జాతకం చూపించగా ఆయన వీరి మ్యారేజ్ సెట్ కాదని చెప్పారని తెలిపారు. పెళ్లికి ముందు నరేష్ లేచి పోదామని చెప్పారని.. లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందామని నరేష్ కోరగా తాను ఒప్పుకోలేదని వెల్లడించారు. ఇక పెళ్లయిన ఏడాది తర్వాత నరేష్ కి తనకు బాబు పుట్టాడని తెలిపారు రమ్య. నరేష్ కి రఘువీరా రెడ్డి గారి నుండి ఎటువంటి సపోర్ట్ రాలేదని కామెంట్ చేశారు. ఇక తాను భరణం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.
Read also: పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?