Advertisement
త్రివిధ దళాలలో రిక్రూట్మెంట్ ప్రక్రియ లో మార్కుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో అగ్నిపత్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఇందులో భాగంగానే ప్రకటించిన కేంద్రం. రెండువేల 23 జూలై నాటికి అగ్నిపత్ స్కీమ్ కింద దేశంలోని 45,000 మంది యువతను రక్షణ దళం లోకి తీసుకుని రావడమే దీని లక్ష్యం. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు లోపువారే దీంట్లో ఉంటారు. ఆర్మీలో యువతను నింపాలని ఉద్దేశంతో ఈ స్కీం ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్లో భాగంగానే నాలుగేళ్లపాటు యువతను భారత త్రివిధ దళాల్లో… జాయింట్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఉద్యోగంలో చేరిన వారిని అగ్ని వీరులు అని అంటారు.
Advertisement
శిక్షణ ఇలా ; ఎంపికైన వారికి పది వారాల నుంచి ఆరు నెలల వరకు శిక్షణ ఉంటుంది. నాలుగు సంవత్సరాల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికులను మాత్రమే ఆర్మీ లోకి రెగ్యులర్ గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ళపాటు సర్వీస్ లో ఉంటారు. మిగతా వాళ్లకు 12 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు.
Advertisement
నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ :
అగ్నిపత్ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైరయిన అగ్ని వీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ రెండు బలగాల లో చేరడానికి కావాల్సిన గరిష్ట వయోపరిమితిలో అగ్ని వీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. తొలి బ్యాచ్ అగ్ని వీరులకు వయోపరిమితి లో భాగంగా ఐదేళ్ళ సడలింపు లభించనుంది.
అగ్నిపత్ పై వ్యతిరేకత…
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా… రెండు రోజుల కిందట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు చెలరేగాయి. ఆర్మీ అభ్యర్థులు పెట్రోల్ పోసి రైళ్లు తగలబెట్టారు. అగ్నిపత్ పథకంతో కాంట్రాక్టు జాబుల కింద తమను ట్రీట్ చేస్తారని.. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేసి.. పాత రూల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
also read;