Advertisement
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు అమితాబ్ బచ్చన్.. ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ తండ్రిగారి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీ లోకి వచ్చారు.. కానీ ఆయన అనుకున్నంత రేంజ్ లో స్టార్ హీరో కాలేకపోయారు.. సెకండ్ హీరోగానే సెటిల్ అయిపోయారని చెప్పవచ్చు.. అయితే అభిషేక్ బచ్చన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన క్రేజ్ పెరిగిపోయింది.. అలా బాలీవుడ్ లోనే చూడ ముచ్చటైన జంటగా వీరికి పేరు ఉంది..
Advertisement
also read: మెగాస్టార్ చిరుకి 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరంటే..!!
అలాంటి ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం.. మొన్నటి వరకు దీపికా రణవీర్ విడాకులు తీసుకోబోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఈ వార్తను నెటిజనులు వైరల్ చేస్తూ ట్రెండింగ్ చేసేసారు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.. నేను విడాకులు తీసుకోబోతున్నా అన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు.. దానికి నేను సిద్ధమే.. కానీ నాకు రెండవ పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే..
Advertisement
Ok…. So I believe I’m getting divorced. Thanks for letting me know! Will you let me know when I’m getting re-married too? Thanks. #muppets
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 16, 2014
అది మర్చిపోకండి థాంక్యూ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.. అయితే వీరిద్దరూ 2007లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. 2014లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఆమె పేరు ఆరాధ్య.. ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ తన భార్య ఐశ్వర్య గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.. ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో చెప్పడానికి నాకు మూడో వ్యక్తి అవసరం లేదు.. నేను ఆమెను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఐశ్వర్య నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు.. అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే ఆయన చేసిన ట్వీట్ ను మరోసారి నెటిజన్లు బయటపెట్టి ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు..
also read: