Advertisement
దర్శకులు ప్రతి సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో పెట్టుకుని సినిమాని తీస్తూ ఉంటారు. అయితే సినిమా ఫలితం ఒక్కొక్కసారి బానే ఉంటే, ఒక్కొక్కసారి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది ఎవరు ఊహించలేము. కొన్ని కొన్ని సినిమాలని రీమేక్ చేస్తూ ఉంటారు కూడా. రీమేక్ చేసిన సినిమాలు ఒక్కొక్కసారి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిపోతే, ఒక్కొక్కసారి మాత్రం ఫ్లాప్స్ అయిపోతాయి.
Advertisement
చాలావరకు వచ్చిన రీమేక్ సినిమాలు ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోతున్నాయి ఎందుకంటే ఈ మధ్య సినిమాలోని ఓటీటీ లో చూసేస్తున్నారు. ఓటిటిలో అందరూ సినిమాని చూసేశాక మళ్ళీ రీమేక్ చేసినా ఎవరూ చూడరు కదా..? అందుకే సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు. అయితే టాలీవుడ్ లో అజిత్ నటించిన సినిమాలని తెలుగులో రీమేక్ చేయడం కూడా జరిగింది. అజిత్ తమిళంలో నటించిన వీరం సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు గా రీమేక్ చేశారు.
Advertisement
తెలుగులో అభిమానులు ఆ సినిమా రీమేక్ చేయొద్దని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ వినలేదు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా కాటమరాయుడు నిలిచింది. అలానే అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా 2017 లో వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాని తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేదు. పదేళ్లకి పైగా దర్శకత్వంలో మెహర్ రమేష్ దూరంగా ఉండడంతో ఏదో సూపర్ స్టోరీ ని తీసుకొచ్చేసి హిట్ కొట్టేస్తాడేమో అని అందరూ అనుకున్నారు.
కానీ కనీసం యావరేజ్ గా కూడా భోళా శంకర్ నిలవలేదు. చిరంజీవి ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టి సినిమాని పూర్తిగా వదిలేశాడు మెహర్ రమేష్. ఇప్పుడు ఈ సినిమా ఫలితంతో అభిమానులు అజిత్ సినిమాలు రీమేక్ చేయడం మాకు ఇష్టం లేదంటున్నారు. ఇప్పటికైనా మరి రీమేక్ సినిమాలని మెగా హీరోలు ఆపుతారో లేదో చూడాలి.
Also read: