Advertisement
కెరియర్ లోనే ఫస్ట్ మ్యాచ్ అంటే కచ్చితంగా టెన్షన్ పడతాడు ఫస్ట్ మ్యాచ్ ఆడాలంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటానా అని టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని మీట్ అవ్వడం కొంచెం కష్టంతో కూడుకున్నదే. భారతీయ యంగ్ క్రికెటర్ ఆకాష్ దీప్ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే ఇవన్నీటిని కూడా దాటేయచ్చని మంచిగా ఆడచ్చని ప్రూవ్ చేసాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య రాంచి వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ ఆడుతున్నాడు రెస్ట్ వలన టీం కి దూరమైన బుమ్రా ప్లేస్ లో టీం లోకి వచ్చాడు.
Advertisement
ఆకాష్ మొదటి టెస్ట్ లోనే ఇంగ్లాండ్ని వణికిస్తున్నాడు బుల్లెట్ స్పీడ్ తో వేసే బంతులు స్వింగ్ కూడా అవుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్సమెన్స్ షాక్ అవుతున్నారు నిజానికి వణికి పోతున్నారు. అలాంటి ఆకాష్ దీప్ ఎవరు అసలు..? అతని గురించి పూర్తి వివరాలు చూద్దాం డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ తక్కువ గ్యాప్ లోనే మూడు కీలక వికెట్లను తీసేసాడు వచ్చిన బ్యాట్స్మెన్స్ ని వెనక్కి పంపిస్తున్నాడు. ఇంగ్లాండ్ కి పట్టపగలే చుక్కల్ని చూపిస్తున్నాడు. బీహార్ లోని ససారంలో పుట్టాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఇతను చిన్నప్పటి నుండి క్రికెట్ ఇష్టపడేవాడు క్రికెట్ వైపు అడుగులు పడుతున్న టైం లో అతని లైఫ్ లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
Advertisement
అతని తండ్రి చనిపోయాడు అలానే కొన్ని రోజులకి సోదరుడు కూడా కన్నుమూశారు బెంగాల్ కి వెళ్ళాక ఒక క్రికెట్ అకాడమీ లో చేరాడు. ఆ తర్వాత ఒక టోర్నీలో అద్భుతంగా ఆడాడు. దీంతో అతనికి దుబాయ్ కి వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా దుమ్ము లేపేసాడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ డివిజన్ మ్యాచ్లో ఆడే అవకాశాన్ని పొందాడు బెంగాల్ సీనియర్ టీం డైరెక్టర్ జోయ్ దీప ముఖర్జీ దృష్టిలో పడ్డాడు అప్పట్లో బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విజన్ 2020 ప్రోగ్రాం కి ఆకాష్ ని రిఫర్ చేశారు దీంతో కెరీర్ టర్న్ అయింది ఇలా అక్కడినుండి ఇప్పుడు ఏకంగా ఇక్కడ టెస్టులో అడగడానికి అవకాశాన్ని సంపాదించుకునే మంచి సక్సెస్ఫుల్ క్రికెటర్ గా రాణిస్తున్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!