Advertisement
Akhanda Movie Dialogues: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబో గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో వచ్చిన హైట్రిక్ చిత్రమిది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?
ఈ సినిమాలో బాలయ్య నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్యకు భార్యగా నటించి ఆమె పాత్రకు న్యాయం చేసింది. బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్స్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ స్వరాలు సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. ‘అఖండ’ మూవీలో గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Balayyababu Balakrishna Movie Dialogues in Telugu
Advertisement
Akhanda Movie Dialogues: అఖండ డైలాగ్స్
- ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శీనుగారు, మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి శీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా, అనేదానికి చాలా తేడా ఉంది రా లంబిడి కొడకా.
- ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పారదొబ్బుతా..! లెఫ్ట, రైట, టాప, బాటమా, ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడి దొరకదు.
- నీకు సమస్య వస్తే దణ్ణం పెడతారు. మేము ఆ సమస్యకి పిండం పెడతాం. Both are not same.
- అంచనా వేయడానికి నువ్వు ఏమన్నా పోలవరం డ్యామా? పట్టుసీమ తురుమా? పిల్ల కాలువ.
- ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం. దైవ శాసనం.
- విదికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు.
- మేము ఎక్కడికైనా వస్తే తలదించుకొం, తల తెంచుకొని వెళ్ళిపోతాం
- నేను గెలికితే కొట్టే రకం కాదు, గెలుక్కుని కొట్టే రకం. వెంటపడితే కొట్టే రకం కాదు, వెంటపడి కొట్టే రకం. ఎదురు వస్తే కొట్టే రకం కాదు, ఎదురు వెళ్లి కొట్టే రకం.
- మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనగడకే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం.
Read also: ఎన్టీఆర్ మరణానికి, తారకరత్న మరణానికి ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ గమనించారా?