Advertisement
Agent Movie Review in Telugu: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైర్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. స్పై యాక్షన్ త్రిల్లర్ అంశాలతో అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. హిప్ హాప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ( నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: పొన్నియన్ సెల్వన్ – 2 రివ్యూ & రేటింగ్
Agent Movie Review in Telugu
Agent Movie Story: కథ మరియు వివరణ:
ఏజెంట్ మూవీ మొదలవగానే మమ్ముట్టి ఒక మాఫియా ముఠా అని చెబుతారు. అతన్ని పట్టుకోవడంలో డిపార్ట్మెంట్ విఫలం అవుతుంది. దీంతో అతడికి పట్టుకోవడానికి ఒక మంచి ఆఫీసర్ కావాలని భావిస్తారు. ఈ తరుణంలోనే అఖిల్ అయితే బెటర్ అని భావించి.. అతడు అయితేనే ఇలాంటి క్రిమినల్స్ ని పట్టుకోగలడని అఖిల్ కి ఈ ఆపరేషన్ “ఏజెంట్” ని అప్పగిస్తారు. అయితే అఖిల్ వారిని ఎలా పట్టుకుంటాడు..? ఆ సమయంలో హీరోయిన్ అతడికి ఎలా పరిచయం అవుతుంది..? వారి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది..? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Advertisement
భారీ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ కథని సురేందర్ రెడ్డి చాలా బాగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ సన్నివేశం అయితే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అఖిల్ వన్ మ్యాన్ షో. యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి. కానీ లవ్ స్టోరీ, విలన్ రోల్, మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా కథ మాత్రం రొటీన్ గానే ఉంది. అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు చాలా బోరింగ్ గా అనిపించాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి మూవీలో అఖిల్, మమ్ముట్టి అదరగొట్టారు కానీ కథలో దమ్ము లేదు.
Agent Review Telugu: అక్కినేని అఖిల్ “ఏజెంట్” మూవీ రివ్యూ & రేటింగ్ !ప్లస్ పాయింట్స్:
అఖిల్ యాక్టింగ్
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని స్టోరీ
సాంగ్స్
బిజిఎం
రొటీన్ స్టోరీ
రేటింగ్: 2/5
Read also: పెళ్లి చేసుకుని విదేశాల్లో ఫ్యామిలీతో స్థిర పడ్డ ఒకప్పటి ఈ స్టార్ 5 హీరోయిన్స్ ఎవరంటే ?