Advertisement
అఖిల్ అక్కినేని గురించి నెట్టింట ఒక వార్త వైరల్ అవుతోంది. అఖిల్ కాబోయే భార్య ఎవరు అని నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అఖిల్ ని పెళ్లి చేసుకోబోయే ఆమె పేరు జైనాబ్ రావుద్జీ. ఆమె తండ్రి పేరు జుల్ఫీ రావుద్జీ. ఈయన బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంత ప్రత్యేకమో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈయన అంత పేరు కలిగి ఉన్నారు.
Advertisement
జుల్ఫీ బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి ఉన్న కుబేరుడు. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక నిధిగా వ్యవహరించారు. కుమారుడు జైన్ రావుద్జీ ఓ సంస్థకి ఎండీగా, చైర్మన్ గా పని చేస్తున్నారు.
Advertisement
Also read:
ఇది వరకు వీళ్ళు బంజారాహిల్స్ లో ఉండేవారు. దాదాపు క్యాబినెట్ మినిస్టర్స్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, మూడు లక్షల విలువైన ఫర్నిచర్, ల్యాప్టాప్, లక్షన్నర విలువ చేసే కిచెన్ సామాగ్రి, మెడికల్ రీయంబర్స్మెంట్, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, అదనపు ప్రైవేట్ సెక్రటరీ ఇలా అన్నీ ఇచ్చారు. ఈమె హైదరాబాద్ లోనే పుట్టారు. దుబాయ్, లండన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో విలాసాల మధ్య ఆమె పెరిగారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా.