Advertisement
Akkineni Nagarjuna First Wife Name, Images, Photos: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అక్కినేని నట వారసునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగార్జున. నాగేశ్వరరావు నట వారసునిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాగార్జున ఏనాడు కూడా తండ్రిని అనుకరించకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ 3 హీరోలలో ఒకరిగా మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో మన్మధునిగా నిలిచారు. ఆరు పదుల వయసు మీదికి వచ్చినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయడం.. వాళ్ల రేంజ్ లోనే గ్లామర్ ని మెయింటైన్ చేయడం నాగార్జున స్టైల్. అందుకే ఈయనని టాలీవుడ్ కి మన్మధుడు అంటారు.
Advertisement
Read also: వరసకు అన్న చెల్లెల బంధం ! కానీ పెళ్లి చేసుకున్నారు .. అసలు విషయం తెలిసాక ఏమయ్యిందంటే ?
Advertisement
ఇండస్ట్రీలో నాగార్జున అందరితోను స్నేహపూర్వకంగానే మెలుగుతూ ఉంటారు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని అమల ఈయన రెండో భార్య. అయితే అంతకంటే ముందు నాగార్జున దగ్గుపాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. దగ్గుపాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మితో నాగార్జునకి మొదటి వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగచైతన్య. ఇక అప్పట్లో నాగార్జున కి టబు నుంచి సౌందర్య, అమల, అనుష్క వంటి హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వినిపించేవి. ఇందులో నిజా నిజాలు ఏంటనేవి తెలియదు కానీ ఖచ్చితంగా నాగార్జున అయితే మన్మధుడే. అందుకే హీరోయిన్స్ సైతం పడిపోతారు. అయితే ఇలాంటి వార్తలు పుట్టడం వెనక కొంత నిజం కూడా లేకపోలేదు.
మామూలుగానే నాగార్జునకి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయడం వంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా నటించడానికి తెలుగు రాష్ట్రాలకి వచ్చినప్పుడు వాళ్లకి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గెస్ట్ హౌస్ బుక్ చేసేవారు నాగార్జున. ఆ సినిమా అయిపోయే వరకు సదరు హీరోయిన్స్ ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. వారికి ఆ గెస్ట్ హౌస్ లోనే అన్ని సౌకర్యాలను సమకూర్చేవారు. ఇది చూసిన తర్వాత కొంతమంది.. హీరోయిన్స్ కాబట్టే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని గుసగుసలు పెట్టేవారు. ఇలాంటివి చూసి తట్టుకోలేకే రామానాయుడు కూతురు లక్ష్మి.. నాగార్జున కి విడాకులు ఇచ్చిందనే వార్తలు కూడా గతంలో చాలా వినిపించాయి.
Read also: పెళ్ళికి అమ్మాయిలు ఇలా ఆలోచిస్తూ ఉంటారా? ఆమె మనసులో ఎలాంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ?