Advertisement
పెళ్లి అనేది అమ్మాయిలకి అయినా అబ్బాయిలకి అయినా మలుపు తిప్పే అంశమే. అయితే.. పెళ్లి వలన ఎక్కువగా బాధ్యతలు మొయ్యాల్సి వచ్చేది.. తమకంటూ పర్సనల్ లైఫ్ స్పేస్ ని కోల్పోయేది ఎక్కువగా అమ్మాయిలే. ఒకవేళ ఆ మ్యారేజ్ ఫెయిల్ అయితే.. ఎక్కువగా నష్టపోయేది కూడా అమ్మాయిలే. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి ముందే ఆలోచించుకుని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. పెళ్లి చూపుల సమయంలోనే అబ్బాయిని చూడడం మాత్రమే కాదు.. ఆ అబ్బాయి తనకి తగిన వరుడేనా కాదా? అన్నది కూడా తెలుసుకోవాలి. అలా తెలియాలంటే అబ్బాయిలని కచ్చితంగా ఓ ప్రశ్న అడిగెయ్యాలట.
Advertisement
ఇవి కూడా చదవండి: 18 నెలల్లో 108 కేజీల వెయిట్ తగ్గించిన అనంత్ అంబానీ ట్రైనర్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇతని ఫీజ్ ఎంతంటే?
ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరు బెటర్? తేల్చుకోవాల్సింది చంద్రబాబే.. అంటూ వైరల్ అవుతున్న పోస్ట్!
అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఈ విషయాన్నీ స్వయానా ఓ ఐఏఎస్ అధికారి చెప్పడంతో ఈ ప్రశ్న వైరల్ అవుతోంది. అయితే.. దీనికి అబ్బాయిల నుంచి ఎలాంటి ఆన్సర్ రావాలో కూడా ఆయనే చెప్పేసారు. డా. వికాస్ దివ్యకీర్తి అనే 1996 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హోం మంత్రిత్వ శాఖలో 1సంవత్సరం పని చేసి ఆ తరువాత రిజైన్ చేసారు. ఆయన రచయితగా, ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. దృష్టి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ ను స్థాపించి మరింత పాపులర్ అయ్యారు. ఇందులో ఆయన కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బోధిస్తారు.
Advertisement
ఇవి కూడా చదవండి: కొంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా? ఓ లుక్ వేయండి..!
పెళ్లి చూపుల్లో అబ్బాయిని మీరు చివరగా ఎప్పుడు ఏడ్చారు? అన్న ప్రశ్నని వెయ్యాలట. ఒకవేళ ఆ అబ్బాయి ఎప్పుడు ఏడవలేదు అని కాని, చిన్నప్పుడు ఎప్పుడో ఏడ్చాను అని కానీ సామాధానం ఇస్తే.. ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా ఆయనను పెళ్లి చేసుకోవద్దని ఈ ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఏడవని వ్యక్తి కఠినంగా ఉంటాడు. అతని మనసు బండరాయిలా మారిపోతుంది. ఎలాంటి భావోద్వేగాలు లేని వారు ఇతరుల భావోద్వేగాలను కూడా అర్ధం చేసుకోలేరు. ఏడవడం మానసిక బాధని తగ్గిస్తుంది. ఎమోషన్స్ హై లో ఉన్నప్పుడు ఆక్సిటోసిన్, ఎండార్సిన్ విడుదల అవుతాయి. మనసు తేలిక పడ్డ వల్లే ఇతరుల బాధని, మనసుని అర్ధం చేసుకోగలరు. అందుకే జీవితంలో ఏడవలేదు అని చెప్పే వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు అంటూ ఈ ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇస్తున్నారు.