Advertisement
అక్షర హాసన్ కి నటిగా మంచి గుర్తింపు ఉంది. ఈమె తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ పాపులారిటీని, క్రేజ్ ని సంపాదించుకున్నారు. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. అక్షర హాసన్ పేరెంట్స్ విడాకుల గురించి మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టార్ స్టేటస్ కి దూరంగా ఉన్న అక్షర తన తల్లిదండ్రులు విడాకులు ఎంతో బాధపెట్టాయని చెప్పారు.
Advertisement
సెలబ్రిటీల పిల్లలయినంత మాత్రాన మాకు ఎమోషన్స్ ఉండవా అని అడిగారు. మేము కూడా మనుషులమేనని అక్షర హాసన్ అన్నారు. పేరెంట్స్ విడిపోతే అందరూ ఎలా బాధపడతారో మేము కూడా అలానే బాధపడతామని అని చెప్పారు. కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదని అక్షర చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు మాపై ఎంతో ప్రేమను చూపించారని ఆమె అన్నారు. తల్లిదండ్రుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా తల్లిదండ్రులుగా మాకు అండగా నిలబడ్డారని అని చెప్పారు. కొన్నిసార్లు నాకు ఏదైనా అవసరమైతే అక్క దగ్గరకు వెళ్లే దానిని అని ఆమె అన్నారు.
Advertisement
Also read:
స్కూల్లో ఎవరైనా ఏడిపిస్తే వాళ్లను కొట్టాలని చెప్తే అక్క హింస వద్దని చెప్పేదని అక్షర చెప్పారు. అక్క రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేదని ఆమె అన్నారు. అక్క నేను ఒకరికొకరు నిలబడతామని ఇప్పుడు కూడా మేము అలాగే ఉన్నామని అక్షర అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కుటుంబంలో అందరూ ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తామని చెప్పారు ఆ ప్రేమానురాగాలు అలాగే కొనసాగించామని ఆమె చెప్పకు వచ్చారు. ఈమె చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్షర ఇబ్బందులు తెలిసి అంతా ఎమోషనల్ అవుతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!