Advertisement
నటుడు అలీ వైసీపీకి రాజనామా చేసేసినట్టు ప్రకటించారు. 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తరఫున అలీ ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవి తో అలీ సరిపెట్టుకున్నారు 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుండి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. ఆయనకు మొండిచెయ్యి ఎదురైంది.
Advertisement
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. సీటు విషయంలో ఆశ భంగం కలిగింది. దీనికి తోడు ఘోర ఓటమి ఎదురవడంతో పార్టీని విడిచి పెట్టాలని అనుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్దిమంది ఇండస్ట్రీ వాళ్ళల్లో అలీ కూడా ఒకరు పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి హస్తం ఉందని రూమర్ వచ్చింది.
Advertisement
Also read:
Also read:
ఆ వ్యక్తి ఇచ్చిన సూచనలు మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలకు ఎదురుకొందని సినిమా వాళ్ళను ఘోరంగా అవమానించారని ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలతో అలీ బయటకొచ్చేసారట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!