Advertisement
ఆలియా భట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఏప్రిల్ 14 2022న రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నుంచి అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు దాంపత్య బంధాన్ని సమన్వయం చేస్తూ వస్తోంది ఆలియాభట్. అయితే ప్రస్తుతం ఆలియాభట్- రణబీర్ కపూర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. వాళ్ళిద్దరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆలియా భట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Advertisement
ఆలియా భట్ హాస్పత్రి లో స్కానింగ్ చేయించుకుంటూ ఉండగా.. పక్కనే రణబీర్ కపూర్ చూస్తూ కూర్చున్న ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పిక్ తో పాటు రెండు సింహాలు, పక్కనే సింహం పిల్ల ఉన్న ఫోటో ని కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలకు ‘బేబీ కమింగ్ సూన్ ‘ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది . ప్రస్తుతం ఆలియా భట్- రణబీర్ కపూర్ తల్లిదండ్రులు కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. రణబీర్ కపూర్- ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.