Advertisement
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లు, హీరో నిర్మాతలు, హీరో దర్శకులు ఇలా ఎవరైనా కావచ్చు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.. దీంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే బాగుండు అనే విధంగా వారి పెయిర్ ఉంటుంది. కానీ ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. అయితే అలనాటి స్టార్ హీరో ఏఎన్నార్ తో నటించిన అప్పటి స్టార్ హీరోల ఆ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.. అవేంటో మనము ఓ లుక్కేద్దాం..
ANR-వెంకటేష్ :
Advertisement
వీరిద్దరి కాంబోలో 1986 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలాగే ఇదే ఏడాది వైజయంతి మూవీస్ అశ్విని నిర్మాణ సారథ్యంలో మురళీ మోహన్ రావు దర్శకత్వంలో బ్రహ్మరుద్రులు చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో వెంకటేష్ రజిని హీరో హీరోయిన్ లతో పాటుగా ఏఎన్నార్ కలిసి నటించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న అంచనాలను రాబట్టలేదు.
ANR- నాగార్జున:
also read: సీరియల్స్ లో నటించి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్లు వీళ్లే ?
Advertisement
అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో కోదండరామిరెడ్డి డైరెక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ వారి ఆధ్వర్యంలో ఇద్దరు ఇద్దరే మూవీ విడుదలైంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించగా, నాగార్జున రమ్యకృష్ణ హీరోహీరోయిన్లు గా ఉన్నారు.. వీరి కాంబో లో వచ్చిన రెండో సినిమా ఇది.. కానీ అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.
ANR- చిరంజీవి:
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మెకానిక్ అల్లుడు. ఇందులో చిరంజీవి విజయశాంతి కలిసి నటించారు. అయితే ఇందులో చిరంజీవి నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మొదటి సినిమా ఇది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.
ANR- బాలయ్య:
1994 లో సంపత్ కుమార్ నిర్మాణ సారథ్యం లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గాండీవం. ఈ చిత్రంలో బాలకృష్ణ రోజా హీరో హీరోయిన్ గా నటించారు. ప్రధాన పాత్రలో నాగేశ్వరరావు మోహన్ లాల్ కలిసి నటించారు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. ఈ విధంగా ఈ నలుగురు స్టార్ హీరోలతో అక్కినేని కాంబినేషన్ ప్లాఫ్ కావడంతో ఆ నాలుగు సినిమాలు అనుకున్న విజయం సాధించలేక ఫ్లాప్ అయ్యాయి.
also read: