Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపెస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి చుట్టుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లు బిజేపి ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కెసిఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి తో పాటు కవిత యాగానికి హాజరయ్యారు.
Advertisement
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అన్నారు. బిల్కిస్ భానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లగానే వైఖరి బాగాలేదు. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కెసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికీ కేసీఆర్ భయపడరన్నారు. ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. కెసిఆర్ ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.
Advertisement
కెసిఆర్ కుమార్తెను కాబట్టే నాపైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసిన వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించారన్నారు. మొక్కవోని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు కవిత. మరి కవిత చేసిన కామెంట్స్ పై బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి: ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!