Advertisement
బాలకృష్ణ సినిమా నటుడుగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు వచ్చారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు ఈ సెలబ్రేషన్స్ కి హాజరై బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వర్గాలు అభిమానులు ఆశపడ్డారు. అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా వార్తల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా వివాదాస్పదంగా మారిపోయింది.
Advertisement
బన్నీ కారణంగా అల్లు ఫ్యామిలీ మెటా ఫామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పై మెగా ఫాన్స్ ట్రోల్స్ కి దిగుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఏ కార్యక్రమంలో కూడా బన్నీ కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం రావు రమేష్ హీరోగా నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లుఅర్జున్ చీఫ్ గెస్ట్ కింద వచ్చారు.
Advertisement
Also read:
బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి అల్లు అర్జున్ వస్తున్నారు అలాగే చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని అనడంతో ఒకే వేదికను పంచుకోబోతున్నారని అల్లూ, మెగా ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ చిరు ఒకరే వచ్చి తన మిత్రుని అభినందించారు. బాలకృష్ణతో తాను ఫ్యాక్షన్ సినిమాల కలిసి చేయాలని చిరంజీవి మనసులో మాటను చెప్పారు. అల్లు అర్జున్ ఈవెంట్ కు ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. చిరు రావడంతో అల్లు అర్జున్ తన మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!