Advertisement
సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కొనసాగుతున్నారు. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఒకరినొకరు బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు. తమ దగ్గరకు వచ్చిన కథల గురించి.. చేస్తున్న సినిమాలు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. వీళ్ళిద్దరికీ రచయిత దర్శకుడు వక్కంతం వంశీ సన్నిహితులు. టెంపర్ మూవీకి కథ అందించింది కూడా వంశీ. ఈ సినిమాతో వంశీ తారక్ మధ్య బంధం దృఢంగా మారింది.
Advertisement
ఈ సినిమా చేసే సమయంలోనే నీతో ఇంకో సినిమా చేస్తానని వంశీకి తారక్ హామీ ఇచ్చారు. తర్వాత కొన్ని వాళ్లకు ఓ కథను తీసుకుని తనకు వినిపించారు. మరోసారి కథను వినిపించగా ఆలోచిద్దాం అన్నట్లు ఎన్టీఆర్ చెప్పి వదిలేసారు. ఎక్కడో తేడా కొడుతోందని వంశీ ఈ విషయం బన్నీ కి చెప్పారు. కథని అల్లు అర్జున్ చెప్పమంటే వంశీ చెప్పారట. ఈ కథతో సినిమా చూస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారట.
Advertisement
Also read:
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ ఫోన్ చేసి కథ చాలా బాగుంది హిట్టవుతుందని చెప్పారట. సానుకూలంగా స్పందించారు. కొద్దిరోజులకు ఆ సినిమా చేయనని వంశీతో ఎన్టీఆర్ చెప్పేసారు. ఆ సినిమాయే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ వద్దునుకుని అల్లు అర్జున్ నటించి అట్టర్ ఫ్లాప్ ని అందుకోవాల్సి వచ్చింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!