Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయమై, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇక భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కూతురు అర్హ, కొడుకు చేసే అల్లరి, ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇది ఇలా ఉండగా, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీలో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా? ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
జయం, గీతగోవిందం, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, భద్ర, 100% లవ్, పండగ చేసుకో చిత్రాలన్నీ బన్నీ వదిలేయగా ఇవి మంచి విజయం సాధించాయి. ఇక బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాల విషయానికి వస్తే, డిస్కో రాజా, జాను, కృష్ణాష్టమి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఉన్నాయి. అల్లు అరవింద్ తన కుమారుడి బాధ్యతలు తేజకు అప్పగించాలని అప్పట్లో భావించాడు. ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలని అనుకున్నారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అదే సినిమా నితిన్ కెరీర్ కు గట్టి పునాది వేసింది.
Advertisement
ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తున్న సమయంలో భద్ర ఆఫర్ వచ్చింది. మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అలా భద్ర సినిమాను వదిలేశాడు అల్లు అర్జున్. కాగా, ఇటీవల పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇదే ఊపులో.. పుష్ప 2 కూడా చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Read also: యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..