Advertisement
అల్లు అరవింద్ కుటుంబం విషయానికి వస్తే చాలామందికి అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే తెలిసు. కానీ వీళ్ళిద్దరి కంటే పెద్ద వ్యక్తి అల్లు బాబి అలియాస్ వెంకటేష్ ఉన్నాడని చాలామందికి తెలియదు. అభిమానులకు మాత్రమే అల్లు అరవింద్ కు మరో అబ్బాయి ఉన్నాడని తెలుసు. కానీ మిగతా మానవాళికి ఆయనకు మరో కుమారుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రీసెంట్గా వరుణ్ తేజ్ గని మూవీతో నిర్మాతగా మారారు. మెగా నిర్మాత అరవింద్ పెద్ద తనయుడుగా బాబీ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. ఆయన గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి.. కొండంత బ్యాగ్రౌండ్ ఉన్న అల్లు బాబి..
Advertisement
also read:యూట్యూబ్ క్లాస్ లు వింటూ MBBS సీటు కొట్టింది.. హారిక ఎలా సాధించిందో తెలుసా?
Advertisement
ఇప్పటికీ తన సొంత గుర్తింపు కోసం ఎన్నో సాధించాడు. ఐటీ మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాడట. గీత ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనుక తన పాత్ర సమర్థవంతంగా పోషించారు. లండన్, ఆస్ట్రేలియా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టారు చేసి.. టెక్నాలజీ ఇంటర్ప్రిటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఇదే రంగంలో దాదాపు 15 సంవత్సరాల పాటు ఉండి సరికొత్త ఆలోచనలకు తెరలేపారు. ఈ క్రమంలోనే ఎన్విరాన్మెంట్ అండ్ ఏంబేడెడ్ సిస్టం లాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర దశాబ్దం పాటు ఐటీ రంగంలో తన వంతు కృషి చేశారు.
జస్ట్ టికెట్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ టికెట్ అమ్మకానికి అంకురార్పణ చేసి ప్రస్తుతం దానికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఏపీలో ప్రభుత్వం తరఫున ఆన్లైన్ టికెట్ల రూపకల్పనలు చేసే బాధ్యతలు కూడా ఈయన తీసుకున్నారు.. అంతేకాకుండా గీత ఆర్ట్స్ లో వచ్చే ప్రతి సినిమాకు తన వంతు బాధ్యతగా తెర వెనుక ఎంతో కృషి చేస్తుంటారు బాబి. తెలుగువారి తొలి ఓటిటి ఆహా కోసం టెక్నాలజీలో ఎన్నో మెలకువలు నేర్పారు. ఈ విధంగా ఆయన టెక్నాలజీ రంగంలో ముందుకు పోతూ 15 ఏళ్లుగా ఎన్నో విజయాలను తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
also read: