Advertisement
టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడిల ప్రవాహం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా అమర రాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది.
Advertisement
ఈ మేరకు అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమర రాజా గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా గ్రూప్ డైరెక్టర్ గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
Advertisement
అయితే, ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 37 సంవత్సరాలుగా అమర రాజ సేవలందిస్తోంది అని పేర్కొన్న కేటీఆర్, సుమారు తెలంగాణ రాష్ట్రంలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు రావటానికి అన్ని వసతులు కల్పిస్తున్నామని, తెలంగాణలో మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరరాజా బ్యాటరీస్ ను విస్తరించాలని భావించడం గల్లా జయదేవ్, తమ సంస్థ కార్యకలాపాలను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది యువతకు ఉపాధి కల్పిస్తుంది అన్న భావన తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు.
Thank you Galla jayadev for Trusting Telangana Gov & Our Leader @KTRTRS pic.twitter.com/aU3ZLtbwSN
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) December 2, 2022
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?