Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యలలో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి మెచ్చి పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికీ పడలేదు. అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ.5 కోట్లు ఇచ్చారు. ఆపై సినీ నటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట.
Advertisement
ప్రస్తుతం తన మూడో భార్య అన్నా లెజీనావో తో కలిసి ఉంటున్నారు. ఈ మూడు పెళ్లిళ్లపై పవన్ స్పందించారు. ఎప్పుడూ లేనివిధంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి అంటూ ప్రశ్నించారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ ఫైర్ అయ్యారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునేలోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది అంటూ చురకలు అంటించారు.
Advertisement
ఇక అంబటి రాంబాబు అంతకుముందు కూడా వరుస ట్రీట్లతో పవన్ మీద అంబటి రెచ్చిపోయాడు. *యుద్ధం అన్నాడు, సిద్ధమన్నాడు, తిరిగి చూస్తే కనిపించడే ఈ ప్యాకేజీ స్టార్, అంటూ ఓ ట్వీట్ చేయగా, మరో ట్వీట్ లో ‘అతనికి తిక్కుంది, దానికి బాబు దగ్గర లెక్కుంది’ అంటూ సెటైర్లు వేశారు. ఇక ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ మంగళగిరిలో వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మహిళా కమిషన్ ఖండించింది. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అభ్యంతరం చెబుతూ క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పంపింది. ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పంపడాన్ని జనసేన నాయకులు తప్పు పడుతున్నారు. మీకో న్యాయం, ఎదుటి వాళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది ! pic.twitter.com/YxGK52BIbg
— Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2022
READ ALSO : అన్న బాటలో తమ్ముడు..మునుగోడు ప్రచారానికి దూరం రాజగోపాల్ రెడ్డి !