Advertisement
అమృతా ఫడ్నవీస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ పేరు. ఎక్కడ చూసినా ఆమె వీడియోలే. ఎటువెళ్లినా చర్చంతా ఆమె గురించే. ఈమె మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య. బ్యాక్ గ్రౌండ్ రాజకీయ నేపథ్యమే అయినా.. ఎప్పుడూ ట్రెండీ లుక్స్ తో కనిపిస్తుంటారు అమృతా ఫడ్నవీస్.
Advertisement
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఈమె. పాటలు పాడడం.. నచ్చిన సాంగ్ కు డ్యాన్సులు చేయడం చేస్తూ ఉంటారు. అయితే.. ఈమధ్యే అమృత ఓ వీడియో వదిలారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మూడ్ బనాలియా పేరుతో చేసిన ఈ సాంగ్.. జనవరి 6న రిలీజ్ అయింది.
యూట్యూబ్ లో రిలీజైన ఈ పాటకు 2.2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆర్టిస్ట్ మీట్ బ్రోస్, అమృతా ఫడ్నవీస్ ఈ వీడియోను రూపొందించారు. ఐశ్వర్య త్రిపాఠి సంగీతం అందించారు. అయితే.. ఈ మూడ్ బనాలియా సాంగ్ ను వాడుతూ ఓ రీల్ చేయాలని నెటిజన్లు ఆమెకు సవాల్ విసిరారు. ఛాలెంజ్ యాక్సెప్ట్ అంటూ వెంటనే వీడియో చేసి వదిలారు అమృతా ఫడ్నవీస్.
Advertisement
రీల్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ వచ్చాయి. మిసెస్ ఫడ్నవీస్ డ్యాన్స్ బాగా చేస్తున్నారంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంతో అందంగా డ్యాన్స్ చేశారని మెచ్చుకుంటున్నారు.
Show us what you've got! 😎
Take #MoodBanaleya hookstep challenge and create your own reel using the song hashtag and tag us in them.
Tune in now: https://t.co/mPDS74OYIj
@TSeries #BhushanKumar @meetbros @kumaarlyricswriter @Ad7777Adil
💃 💃 pic.twitter.com/VHiDcEfqTK— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) January 8, 2023