Advertisement
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు పేర్లు వినపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమృత ప్రణయ్ కూడా పాల్గొనబోతోందని వార్తలు వస్తున్నాయి. పలువురు పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. అమృత ప్రణయ్ ఒక విషాద ఘటన ద్వారా అందరికీ పరిచయం అయ్యారు. తర్వాత ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు.
Advertisement
ఈ క్రమంలో అమృత ప్రణయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాను అంటూ వార్తలు వస్తున్నాయని ఇందులో నిజం లేదని ఆమె చెప్పారు. ఈ వార్తలు విన్న తన తల్లి అలాగే అత్తయ్య నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమాల్లోకి వెళ్తున్నావా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్ళలేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.
Advertisement
Also read:
ఈ వీడియోలో భాగంగా చాలామంది తాను పొట్టి బట్టలు వేసుకున్నానని నాన్ వెజ్ తింటున్నాను అని విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళం అయినా చిన్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందని మా నాన్న కూడా తినేవారు కానీ మధ్యలో మానేశారని ఆమె అన్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా స్టైలిష్ గా బట్టలు వేసుకునే దాన్ని. మీరు నన్ను చిన్నప్పటినుంచి చూడలేదు ఒక విషాద ఘటన ద్వారా నేను మీకు పరిచయం అయ్యానని ఆమె అన్నారు. నా వస్త్రధారణలో మార్పు మధ్యలో వచ్చింది కాదని ఆమె చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!