Advertisement
ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ 2016 లో విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఆఖీరా, ఆద్య అమ్మ రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. విడాకుల అనంతరం రేణు పూణే వెళ్లిపోయారు. అక్కడే ఆమె కెరీర్ స్టార్ట్ చేశారు. మరోవైపు పవన్ అన్న లెజినోవాను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ కూడా రెండో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
Advertisement
కానీ రేణు రెండో వివాహాన్ని పవన్ అభిమానులు అంగీకరించలేదు. ఆమెను పవన్ ఫ్యాన్స్ బెదిరించారు. ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ మాత్రం గత కొన్ని రోజుల నుంచి విదేశాల్లో విహారిస్తోంది. స్కాట్లాండ్ లో గత కొన్ని రోజులుగా సందడి చేస్తోంది. తన పిల్లలు ఆధ్యా, అఖీరా నందన్ లతో కలిసి విహరిస్తోంది. అలా స్కాట్లాండ్ వీధుల్లో రేణు దేశాయ్ చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది. ఆధ్యా చేసే అల్లరిని తన ఫాలోవర్లకు చూపిస్తూనే ఉంది.
అకిరా నందన్ వీడియోలు, ఫోటోలు మాత్రం ఎక్కువగా బయటకు రావడం లేదు. ఆఖీరా నందన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు కనిపిస్తోంది. స్కాట్లాండ్ లోనే అకిరా నందన్ చదువుకునేట్టు కనిపిస్తోంది. మొత్తానికి రేణు దేశాయ్ మాత్రం ఇప్పుడు తన పాత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటుంది. నీతోనే డాన్స్ షోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. 2017 లో ఇలా ఆ షో కోసం రెడీ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా కూడా నిన్న జరిగినట్టు అనిపిస్తోందంటూ ఎమోషనల్ అయింది. నా ఐఫోనే నాకు అఫీషియల్ పర్సనల్ ఎడిటర్ అని చెబుతూ నాటి ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
Read also : రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!