Advertisement
టాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంతో తెలుగు చిత్రసిమలో విషాదఛాయలు అనుముకున్నాయి. కృష్ణ అంత్యక్రియలకు ముందు పద్మాలయ స్టూడియోస్ లో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చారు. దీంతో అభిమానులు సైతం పద్మాలయ స్టూడియోస్ వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే కొంతమంది అభిమానులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కాగా కృష్ణని చివరి చూపు చూసేందుకు అనుకొని వ్యక్తి అక్కడకు వచ్చారు. ఆమెను చూసిన నరేష్ మైండ్ బ్లాక్ అయింది.
Advertisement
Read also: సూపర్ స్టార్ నల్ల కళ్లద్దాల వెనుక అసలు స్టోరీ ఇదే !
Advertisement
ఆమె ఎవరో కాదు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించేందుకు ఆమె అక్కడికి రావడంతో రమ్యను చూసి నరేష్ షాక్ తిన్నారు. వీరిద్దరి మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నరేష్ – రమ్య రఘుపతి విడిపోయి చాలా కాలం అవుతుంది. ఆమె దూరమయ్యాక నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం నేరమని రమ్య రఘుపతి గతంలో ఆరోపించింది. ఇక ఇటీవల నరేష్ – పవిత్ర ఓ హోటల్ గదిలో ఉండగా రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగిన విషయం తెలిసిందే. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. వారు ఆ హోటల్ నుండి బయటకు వెళుతుండగా రమ్యా రఘుపతి గట్టిగా అరుస్తూ వారిపై దాడి చేయడానికి యత్నించింది.
నరేష్ పవిత్రను తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరి కుమార్తెనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. నరేష్ పై రమ్య రఘుపతి న్యాయపోరాటం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన మామయ్య కృష్ణను కడసారి చూసేందుకు ఆమె కర్ణాటక నుంచి వచ్చారు. ఆ సమయంలో నరేష్, పవిత్ర లోకేష్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో వారి మధ్య ఇబ్బందికర వాతావరణం చోటుచేసుకుంది. కాగా రమ్య రఘుపతి కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.