Advertisement
Anchor Anasuya Family Background: యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్స్ కి గ్లామర్ పాటలు నేర్పింది అనసూయ అని చెప్పవచ్చు. ఓవైపు యాంకరింగ్ తో పాటు మరోవైపు నటనలోనూ దూసుకెళ్తుంది. ఆమె వయసు పెరిగే కొద్దీ తన అందాల ప్రదర్శనను పెంచుతూ ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయిని పాత్రతో దుమ్మురేపింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ సినీ రంగంలో కూడా తలుక్కుమని మెరుస్తుంది. అయితే అనసూయ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి.
Advertisement
అంటే పక్కా తెలంగాణ అమ్మాయి అన్నమాట. అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. సుదర్శన్ రావు కు అనసూయ తొలి సంతానం. అనసూయ కి ఓ చెల్లెలు కూడా ఉన్నారు. ఎంబీఏ చేసిన అనసూయ ఆ తర్వాత కొన్నాళ్లపాటు హెచ్ఆర్ గా ఓ కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత న్యూస్ రీడర్, యాంకర్ గా మారింది. జబర్దస్త్ ఆమెకు మంచి ఫేమ్ ని తీసుకువచ్చింది. ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇక అనసూయ తండ్రి సుదర్శన్ రావు విషయానికి వస్తే.. ఈయన ఒకప్పుడు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పని చేశారు.
Advertisement
అలాగే యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా సేవలు కూడా అందించారు. అయితే 2021 డిసెంబర్ 5వ తేదీన సుదర్శన్ రావు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి క్యాన్సర్ కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ రావు ఇంట్లో ఎప్పుడు మిలిటరీ డిసిప్లిన్ మైంటైన్ చేసేవారట. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట సుదర్శన్ రావు. కానీ అనసూయ మాత్రం భద్రకాళీ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకొని, ఆ తరువాత ఐడిబిఐ బ్యాంకు లో పనిచేసింది. అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో చేరింది. ఇక ఆ తర్వాత న్యూస్ రీడర్ నుంచి యాంకర్ గా మారి ఇప్పుడు సినిమాలలో రాణిస్తోంది.
Read also: సినిమా నేపథ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్.. కారణం అదేనా..?