Advertisement
Anchor Anasuya Bharadwaj Father : జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. యాంకరింగ్ తోనే కాకుండా తన నటనతో కూడా ఎంతోమందిని మెప్పిస్తోంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా తరగని అందంతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె జన్మస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. అంటే తెలంగాణకు చెందిన అమ్మాయి. తన తండ్రి సుదర్శన్ రావు ఓ బిజినెస్ మాన్. ఆయన తల్లి పేరు నే అనసూయకు పేరుగా పెట్టారు. ఇంట్లో ఎప్పుడూ మిలటరీ డిస్ప్లేన్ ఉండేదట.. ఎందుకంటే అనసూయను ఆర్మీలోకి పంపించాలనే కోరిక సుదర్శన్ రావుకు ఉండేది. ఇక అనసూయ బద్రుక కాలేజీ నుంచి ఎంబీఏ పట్టా అందుకొని ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంకులో పనిచేసింది.
Advertisement
Anchor Anasuya Bharadwaj Father
ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం చేసింది. ఇందులో పనిచేస్తున్న సమయంలోనే సాక్షి టీవీలో యాంకర్లు కావాలని ప్రకటన రావడంతో దానికి అప్లై చేసింది. నాకెందుకు వస్తుందిలే అనుకున్న సమయంలోనే ఆమెను ఎంపిక చేశారట సాక్షి మేనేజ్మెంట్. కొన్నాళ్లపాటు అక్కడ జాబ్ చేసింది. ఆ తర్వాత అది ఇష్టం లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. కానీ ఆమెకు మాత్రం సినిమాల్లోకి రావాలనే కోరిక బలంగా ఉండేది. దీంతో అవకాశాలు వెతుకుతున్న సమయంలో నాగ వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైంది. మొదట్లో ఆమె అనుకున్న మేర సక్సెస్ సాధించకపోవడంతో సినిమాలను పక్కనపెట్టి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.
Advertisement
also read:తండ్రి మరణించిన రోజే దుఃఖంలో కూడా మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు
Anchor Anasuya Bharadwaj Father, Family Details
యాంకర్ గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మాటీవీ భలే ఛాన్స్ లే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ జబర్దస్త్ షో యాంకర్ గా చాలా పాపులర్ అయింది. ఆమె మాట తీరు, అంద చందాలతో జబర్దస్త్ షోను టాప్ ప్లేస్ కి తీసుకెళ్లింది. ఈ విధంగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు సోగ్గాడే చిన్నినాయన,గాయత్రీ, క్షణం,యాత్ర వంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది.. ఇక అనసూయ వివాహ విషయానికి వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడింది. ఎన్సిసి క్యాంపులో శశాంక్ భరద్వాజను ఆమె పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసాడట. ఈ విధంగా 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో అనసూయ 2010లో భరద్వాజను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
also read:మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?