Advertisement
బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని తెలుగు కుటుంబాలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో. ప్రదీప్ బుల్లితెరపై అనేక షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు.
Advertisement
అయితే, ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ప్రదీప్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇది వరకే ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి కూడా ప్రదీప్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
Advertisement
ప్రదీప్ గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని, చివరికి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వీరి కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు కూడా జరిగిపోయాయి అని సమాచారం. ఇక ఈయన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయినటువంటి నవ్య మారోతుతో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే తనని పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది. మరి దీనిపై ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Read also: DHAMAKA REVIEW AND RATING IN TELUGU : ధమాకా మూవీ రివ్యూ..