Advertisement
ఎంతో ఉత్సాహంగా ఢిల్లీ బయలుదేరారు ఏపీ సీఎం జగన్. స్పెషల్ ఫ్లైట్ లో ఈ ప్రయాణం మొదలైంది. కానీ, ఏం జరిగిందో ఏంటో తెలియదు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి తిరిగొచ్చింది ఫ్లైట్. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మీడియాలో వార్త హైలైట్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. జగన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Advertisement
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడమే ఈ ఆందోళనకు కారణం. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించారు సిబ్బంది. ఆ వెంటనే, తిరిగి గన్నవరం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోమవారం సాయంత్రం 5.03 గంటలకు విమానం టేకాఫ్ అయింది. తిరిగి సాయంత్రం 5.20 గంటలకు వెనక్కి తిరిగొచ్చేసింది.
Advertisement
సమస్య పరిష్కారమవుతుందని భావించిన జగన్.. కొద్దిసేపు విమానాశ్రయంలోనే ఎదురుచూశారు. కానీ, అయ్యే పని కాదని భావించి తర్వాత తాడేపల్లి వెళ్లిపోయారు. మళ్లీ రాత్రికి ఢిల్లీ పయనం అయ్యారు ఏపీ సీఎం. హస్తినలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం రేపు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.
మరోవైపు కేంద్ర పెద్దలను కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ తీసుకున్నారని సమాచారం. అలాగే, నిర్మలా సీతారామన్ ను కూడా కలవనున్నారని తెలుస్తోంది.