Advertisement
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జోష్ మీద ఉంది. దీనితో బిఆర్ఎస్ నేతల్లో గాబరా ఎక్కువైంది. లోపల ఆందోళన ఉన్నా బిఆర్ఎస్ నేతలు పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నినా మొన్నటి వరకు తెలంగాణాలో బిజెపి బలంగానే కనిపించింది. కానీ, ఇటీవల బిజెపి చతికిల పడినట్లు కనిపిస్తోంది. దీనితో చాల వరకు సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకే చెందేటట్లు ఉంది. ఇప్పటికే కొందరు దిగ్గజ నేతలు అంతా హస్తం గూటికి చేరారని తెలుస్తోంది.
Advertisement
బిఆర్ఎస్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయినప్పటికీ.. బిఆర్ఎస్ పార్టీ వెనుకబడినట్లు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయంలో కొన్ని విషయాలు కీలక పాత్ర పోషించాయి. బీజీపీ, కాంగ్రెస్ మధ్య ఓటు బ్యాంకు రెండుగా విడిపోవడం బి ఆర్ ఎస్ కు కలిసి వచ్చింది. మరో వైపు ఆంధ్ర సెటిలర్స్ కూడా బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు కలిసి రాకపోవడం కూడా బి ఆర్ ఎస్ కు ప్లస్ అయ్యింది. అలాగే తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ కూడా సక్సెస్ అయ్యారు. వీటన్నిటితో విజయం సొంతం అయ్యి కేసీఆర్ సీఎం గా ఎన్నిక అయ్యారు.
Advertisement
కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యింది. ఈ అంశాలేవీ ఇప్పుడు అనుకూలించడం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన పోటీదారుగా ఉంది. టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ అవ్వడంతో.. సెంటిమెంట్ కి కూడా అవకాశం లేదని తెలుస్తోంది. దీనితో ఆంధ్ర సెటిలర్ల ఓట్లుకు బి ఆర్ ఏస్సే గండి కొట్టుకున్నట్లు అయ్యింది. బాబు అరెస్ట్ కావడంపై ఎపి నుంచి అమెరికా వరకు ప్రతి తెలుగు వాడు స్పందిస్తున్నాడు. హైదరాబాద్ లో కూడా ఇలాంటి స్పందనే వస్తున్నా.. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు? అంటూ కేటీఆర్ విమర్శించడం సోషల్ మీడియాలో రచ్చకి తెరలేపింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలుగు వాళ్ళు హర్షించడం లేదు. దీనితో కొంత వ్యతిరేకత వ్యక్తమైనట్లే కనిపిస్తోంది.
మరిన్ని..