Advertisement
గతంలో చిరంజీవి ‘చూడాలని ఉంది’, బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’, వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’, నాగార్జున ‘రావోయి చందమామ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అంజలా జావేరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె చివరిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించింది. అయితే ఈమెకి, ఇటీవల టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ ఆరోరాకి ఓ సంబంధం ఉంది.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
Advertisement

Heroine Anajala Zaveri Husband name images
Heroine Anajala Zaveri Husband Name, images
‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో విలన్ గా నటించాడు తరుణ్ ఆరోరా. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’, ‘జయ జానకి నాయక’, ‘అర్జున్ సురవరం’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతను అంజలా జావేరి భర్త అన్న విషయం బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. తరుణ్ ఆరోరా, అంజన జావేరి లది ప్రేమ వివాహం అని తెలుస్తుంది.
20 ఏళ్ల నుండి వీరిద్దరు ప్రేమించుకొని ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారట. వీళ్లకు ఇంకా పిల్లలు లేరట. కాబట్టి ఒకరికొకరు పిల్లలు వలె గారంగా ఉంటారని తెలిపాడు తరుణ్. ఇక అంజాల వల్లే ఇతనికి తెలుగు, తమిళ భాషల సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి అన్న విషయాన్ని కూడా ఎటువంటి ఈగో లేకుండా తెలిపాడు ఈ స్టైలిష్ విలన్. ఇతను కూడా ఒక మోడల్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?




