Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల పర్వం మొదలైంది. 2018 ఎన్నికల అనంతరం… రకరకాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్ లో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగగా… ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయకముందే… తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎక్కడో కాదు.. గోషామహల్ నియోజకవర్గంలోనే కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటి గోషామహల్ ఉపఎన్నిక ఇప్పుడు ఎందుకు వస్తుందని అనుకుంటున్నారా…? అవును ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనట్లే తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే…
Advertisement
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఇప్పటికే ఆ పార్టీ సస్పెండ్ చేయగా, ఏకంగా శాసనసభ నుంచే ఆయనను బహిష్కరించాల్సిందిగా మజ్లిస్ డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ సమాజం నుంచి ఆయనను బహిష్కరించాల్సిన అవసరం ఉన్నదంటూ సి ఎల్ పి నేత బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బిజెపి శాసనసభ పక్షనేతగాను ఉన్నందున ఆ బాధ్యతల నుంచి కూడా రాజాసింగ్ ను ఆ పార్టీ హైకమాండ్ తొలగించింది. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కొత్త శాసనసభ పక్ష నేత లేకుండా పోయింది. ఆ సమయంలో ఆయనను సభ సమావేశాల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని, బహిష్కరించేందుకు శాసనసభ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి బుధవారం లేఖ రాశారు.
Advertisement
దీంతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్, తాజాగా మునుగోడు శాసనసభ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆమోదం తెలిపిన స్పీకర్, ఇప్పుడు రాజాసింగ్ విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఒకవేళ స్పీకర్ పోచారం.. కోమటిరెడ్డి తరహాలోనే.. రాజాసింగ్ విషయంలో నిర్ణయం తీసుకుంటే… ఉప ఎన్నిక అనివార్యం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!