Advertisement
చంద్రబాబు నాయుడు ఇటీవలే మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కంటి ఆపరేషను చికిత్స నిమిత్తం ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను కోర్టు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. అయితే.. ఆయన నాలుగు వారాల తరువాత అంటే నవంబర్ 28 న తిరిగి పోలిసుల వద్దకు వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది. కానీ.. ఆయనను ఈ లోపలే అరెస్ట్ చేయించాలి అని వైసీపీ వ్యూహం పన్నుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Advertisement
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించినా.. వైసీపీ సర్కార్ మాత్రం ఆయన్ని వదలడం లేదు. తాజాగా చంద్రబాబు నాయుడుపై ఇసుక కుంభకోణం కేసు నమోదైంది. ఏ 1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్ , ఏ 4 గా దేవినేని ఉమా లపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ కుంభకోణంలో ఏపీ ఖజానాకు నష్టం వాటిల్లింది అంటూ సీఐడీ పేర్కొంది. 1300 కోట్ల రూపాయలను పక్కదోవ పట్టించారు అంటూ జగన్ సర్కార్ ఆరోపణ చేస్తోంది.
Advertisement
ఈ విషయమై తాజాగా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు నాయుడుపై వీలైనంతగా కేసులు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తనపై తప్పుడు కేసులు నమోదవుతున్నట్లు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే.. తీర్పుని సుప్రీం రిజర్వ్ లో ఉంచింది. ఒకవేళ ఈ తీర్పు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటె.. ఈ కేసుల నుంచి ఆయనకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. లేకుంటే.. అన్ని ఆయన మెడకి చుట్టుకుంటాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఆత్మస్థైర్యాన్ని కేసులను పెట్టి దెబ్బ తీయడమే వైసీపీ వ్యూహంగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read More:
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?
సలార్ గురించి గూస్ బంప్స్ తెప్పించే నిజాలు.. ఆ ఒక్క సీన్ కోసం ఇంత చేస్తున్నారా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంతటి ఘోరానికి ఒడిగట్టారు.. అసలేం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే!