Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా చంద్రబాబు పై మరో పీటీ వారెంట్ నమోదు అయింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పీటీ వారెంట్ నమోదైంది. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో పీటీ వారెంట్ జారీ చేసింది సీఐడీ. తాజాగా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వర్గాలు పీటీ వారెంట్ నమోదు చేయడం గమనార్హం.
Advertisement
ఇప్పుడు దీనిని కూడా ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సెన్షేషనల్ గా మారింది. టెరాసాప్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్ కి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దాదాపు రూ.321 కోట్ల మేర అవకతవకలు జరిగియని సీఐడీ ఆరోపిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఇప్పటికే 9 మందిని విచారించి కొందరినీ అరెస్ట్ చేశారు. తాజాగా చంద్రబాబు పై అభియోగాలు నమోదు చేశారు.
Advertisement
ఇవి చదవండి : చంద్రబాబు డ్రీమ్స్ కు జగన్ బ్రేక్.. అసలు కారణం అదేనా ?
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని 2021లోనే ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. టెరా సాప్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేవిధంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి లోకేష్, ఐటీ సలహాదారుడు హరికృష్ణ ల మీద ఈ విషయంపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో ఈ కేసుపై లోకేష్ కూడా జైలుకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గత కొద్ది రోజుల కిందటే లోకేష్ భార్య బ్రాహ్మిణి పేర్కొన్న విషయం విధితమే. ఫైబర్ నెట్ స్కామ్ కి సంబంధించి మరికొద్ది రోజులు గడిస్తే కానీ పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ఇవి చదవండి : ఎన్టీయార్ బాలయ్య మధ్య గొడవకి కొడాలి నాని కి ఉన్న సంబంధం ఇదేనా ?