Advertisement
హామాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడులు జరపడంతో ఇజ్రాయిల్ దళాలు ఎదురు తిరిగాయి. ఈ క్రమంలో వీరికి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ప్రేమ జంట చేసిన పని ప్రపంచానికి ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తోంది. ఈ జంట మరో సీతారామం జంటగా నిలిచింది. ఈ సినిమాలో కూడా యుద్ధంలో పాల్గొనే హీరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నా.. యుద్ధం కోసం పిలుపు రావడంతో వెళ్ళిపోతాడు. చివరకు శత్రు దేశంలో చిక్కుకుని బందీ అవుతాడు. ఇలాంటి సంఘటనే ఇజ్రాయిల్ వద్ద కూడా చోటు చేసుకుంది.
Advertisement
ఇజ్రాయెలీ మిలిటరీ రిజర్విస్ట్‌లలో ఉరి మింట్జెర్ మరియు ఎలినోర్ యోసెఫిన్ లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. హఠాత్తుగా హమాస్ దాడికి దిగడంతో వీరు డ్యూటీకి రిపోర్ట్ చేసేముందు వివాహం చేసుకున్నారు. వీరు తమ సంబంధిత యూనిట్లకు రిపోర్ట్ చేసే ముందే ఆకస్మికంగా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 8 వ తేదీన తెల్లవారుజాము సమయంలో హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా దాడికి దిగడంతో.. ఇజ్రాయిల్ మిలిటరీ కూడా ఎదురు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
Israeli couple ties the knot on eve of military deployment #AndyVermautLovesTheJewishNewsSyndicate https://t.co/xbEt1AiV73 pic.twitter.com/HU9JwtYDrT
Advertisement
— Andy Vermaut (@AndyVermaut) October 9, 2023
ఈ యుద్ధం మొదలయ్యే సమయానికి వీరు థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు. అయితే.. వారికి సమాచారం అందిన వెంటనే ఇజ్రాయిల్ చేరుకొని ముందుగా హడావిడిగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి గురించి చాలానే కలలు కన్నామని.. ఇలా చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. అక్కడి సంప్రదాయం ప్రకారం సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని షోహామ్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేను ఈ క్షణం గురించి వేల సార్లు ఆలోచించాను, కానీ నేను ఇలా ఊహించలేదు,” అని మింట్జెర్ చెప్పాడు. త్వరలోనే.. వారు కోరుకున్న విధంగా తిరిగి పెళ్లి చేసుకుంటామని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేసారు.
మరిన్ని..
రెండవరోజు విచారణలో ట్విస్ట్.. భువనేశ్వరి ఐటి రిటర్న్స్ వెలుగులోకి..? నారా లోకేష్ ఏమన్నారంటే?
చిరంజీవి కూతురు శ్రీజకు మూడవ పెళ్లి?
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిలియనీర్లు ఎవరో తెలుసా? ఎంత మంది ఉన్నారంటే?