Advertisement
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి షాకులు తప్పట్లేదు. ఇది వరకు ఐదేళ్ల పాటు అధికారం అనుభవించని నేతలతో పాటుగా దశాబ్ద కాలంగా జగన్ కి అండగా ఉన్న పలువురు సన్నిహిత నేతలు కూడా జారుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వైసీపీ కి, ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా గుడ్ బై చెప్పారు. జగన్ కి బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
Advertisement
ఇప్పుడు మరో జగన్ సన్నిహిత నేత కూడా ఇదే బాట పడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత జగన్ కి లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. తర్వాత జనసేన పార్టీలో చేరడానికి మొత్తం ఫిక్స్ చేస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
అదే సమయంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే జగన్ కి వైయస్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా పేరు ఉన్న సామినేని ఉదయభాను సైతం వైసీపీని విడిచి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో టచ్లోకి వెళ్లి సంప్రదింపులు జరిపారు. వైసీపీ నేతలకు మాత్రం అందుబాటులో లేకుండా ఉన్నారు. దీంతో ఆయన కూడా జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!