Advertisement
నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ అంటే సుందరానికి. ఈ సినిమా తాజాగా విడుదలై ఘన విజయం అందుకుంది. అయితే నాని ప్రతి సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంటే సుందరానికి సినిమా మనకు ట్రీజర్, టైలర్ లో చూపించిన సింపుల్ స్టోరీ లైన్ మీద మూవీ మొత్తం నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ మాత్రం ఆ చిన్న పాయింట్ ని ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చూపించడం ఆయనకే సొంతం. ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం కూడా సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం వరకే ఉంటుంది. ఈ మూవీ అసలు కథ ఉండేది సెకండాఫ్ లో.
Advertisement
ఈ సినిమాకి పెద్ద హైలెట్ నానీ యాక్టింగ్ అని చెప్పవచ్చు. నాని కామెడీ టైమింగ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ప్రేక్షకులు చూసి నవ్వుకున్నారు. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర ఉంది. అదే హీరో భామగా చేసిన నటి. ఆమె పేరు అరుణ బిక్షు, అరుణ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లోనే ఉన్నారు. ఎంతోమందికి డ్యాన్స్ మరియు నటన నేర్పారు. అరుణ అంతకు ముందు వచ్చిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మెంటల్ మదిలో అనే సినిమాలో నటించారు.
Advertisement
Also Read: గర్భవతి అయిన మహిళలకు 7వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు?
దీని తర్వాత అంటే సుందరానికి మూవీ లో బామ్మ పాత్రలో నటించి అందరిని అలరించారు. అయితే అరుణ పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే అరుణ మహేష్ బాబు కూతురు సితార కు డాన్స్ నేర్పిస్తుందట. సితార కూచిపూడి డాన్స్ వీడియో చేసి పోస్ట్ చేసినప్పుడు తమ గురువులైన అరుణ భిక్షుకు థాంక్స్ చెప్పారు. ఈ విధంగా అరుణ భిక్షు చాలా సంవత్సరాల నుంచి కూచిపూడి నాట్యం నేర్పిస్తూ ఫేమస్ అయిపోయారు.
Also read: గర్భవతి అయిన మహిళలకు 7వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు?