Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇవాళ ఉదయం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు… నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను 24వ తేదీ వరకు పొడిగించింది. అలాగే రెండు రోజులపాటు చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై ప్రశ్నించనున్నారు సిఐడి అధికారులు.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉండగా… ఇవాళ సాయంత్రం ఏపీ సిఐడి టీం ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ఆధ్వర్యంలో సిఐడి అధికారులు కొంతమంది ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉంటాయని ఇటీవల కాలంలోనే ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఏపీ సిఐడి ఢిల్లీకి వెళ్లడం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
నారా లోకేష్ ను అరెస్టు చేస్తారేమోనని జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సిఐడి అధికారులు… అక్కడ నారా లోకేష్ కదలికలను పరిశీలించనున్నారట. అలాగే సుప్రీంకోర్టు లీగల్ టీం తో కూడా నారా లోకేష్ అరెస్ట్ అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు చేసిన స్కాం గురించి కూడా ఢిల్లీలో ప్రచారం జరిగేలా ఏపీ సిఐడి పోలీసులు ప్రయత్నించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఏపీ సిఐడి పోలీసుల ఢిల్లీ పర్యటన… అందరిలోనూ టెన్షన్ వాతావరణాన్ని తీసుకువచ్చింది.