Advertisement
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ ఇవాళ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పవన్ అభిమానులు ఈ సినిమాను వీక్షించేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఈ మూవీకి ఫ్యాన్స్ నుంచి అబెవ్ యావరేజ్ నుంచి హిట్ టాక్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా బ్రో మూవీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
Advertisement
సాధారణ టికెట్ రేట్లతో తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమా ప్రదర్శితమవుతుంది. రూ.100కోట్ల వరకు కలెక్షన్లను సొంతం చేసుకుంటే కమర్షియల్ గా మంచి లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయి.
బ్రో మూవీలో ఉన్నటువంటి పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఉన్నటువంటి పొలిటికల్ డైలాగ్స్ ని చూసి జగన్ సర్కార్ ను వదలవా బ్రో అంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎప్పటి నుంచో రాజకీయాలను సినిమాలతో విమర్శించే సాంప్రదాయం ఉంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తన ప్రతీ సినిమాలో కూడా పొలిటికల్ డైలాగ్ లను ఉండేవిధంగా చూసుకుంటారు. జనసేన ఇమేజ్ ని పెంచేవిధంగా డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకొని మరీ డైలాగ్ లను రాసినట్టు తెలుస్తోంది.
Advertisement
ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ఓ సీన్ లో టీ గ్లాస్ ని ఉద్దేశిస్తూ.. ఏంటి నీ చేతికి ఆ గాజు గ్లాస్ రావాలి. అంతేగా అంటున్నాడు. కేవలం అది గాజు గ్లాసు మాత్రమే కాదు.. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మార్చే ఆయుధం అంటాడు. అదేవిధంగా మన జీవితం, మరణం భావితరాల కోసమే.. పుట్టిక మలుపు మరణం గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఆలోచన రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు ఏది ఎవ్వరికీ శాశ్వతం కాదు.. ఈరోజు కాకపోయిన రేపు అయిన వదిలేయాల్సిందే. పదవులు కూడా ఎప్పుడూ ప్రమోషన్స్ వస్తాయో.. ఎప్పుడూ రిజైన్ చేయాల్సి వస్తుందో ఎవ్వరు ఊహించలేరు. పుట్టిన వాడు మరణించకుండా ఉండడు.
లైఫ్ ఈజ్ టూ సింపుల్ మార్క్.. రేపు గొప్పగా బ్రతకాలి అని ఈ రోజు తప్పులు చేయకు.. ఇప్పుడు రైట్ గా ఎప్పుడూ గ్రేట్ గా ఉంటావ్. అలా కొన్ని డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాప్ లో వినోదం కీలకం అయితే.. సెకండాఫ్ లో భావోద్వేగాలు కీలకంగా మారాయి. మొత్తానికి ఈ మూవీలో సందర్బానుసారంగా చెప్పిన డైలాగ్ లు కూడా ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశించే చెప్పారని సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనార్హం. మరోవైపు బ్రో మూవీలో కామెడీ చాలా బాగుంది.
ఈ మూవీలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రం అస్సలు నిరాశ పరచదు బ్రో మూవీ అని చెప్పవచ్చు. బ్రో మూవీలో ఉన్న డైలాగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరీ.
మరికొన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ సందర్శించండి !