Advertisement
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల అనుమతులకు పోలీస్ శాఖ సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. మున్సిపల్, పంచాయతీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ కార్యాలయాల చుట్టూ నిర్వాహకులు తిరగకుండా సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది.
Advertisement
వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, ఎత్తు, బరువు వివరాలతో దరఖాస్తులు సమర్పిస్తే అన్ని శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. అనుమతి లేకుండా ఎవరైనా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, రక్షణ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుంటారు. ఒకవేళ అనుమతి తీసుకోకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ అనుమతి తీసుకోవడం చాలా ఉత్తమం.
Advertisement
మరోవైపు వినాయకచవితి సందర్భంగా తిరుమలలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లపై తొలిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టింది. తిరుపతి రోడ్లపై దీనిని తిప్పారు. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తెలిపారు. ఏఏ మార్గాల్లో నడపాలి అనేది ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. రూ. 2 కోట్లతో బస్సును కొనుగోలు చేయగా… మూడు గంటలు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నడవనుంది.
Also Read :
ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో గమనించారా? అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే?