Advertisement
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ, పరిస్థితులు చూస్తుంటే మాత్రం త్వరలో ఎలక్షన్ ఉందా? అనేలా ఉంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఈమధ్య చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు దారితీశాయి. ముఖ్యంగా మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కిందిస్థాయి లీడర్ నుంచి సీఎం దాకా అందరూ వరుసబెట్టి కౌంటర్ దాడి చేశారు.
Advertisement
పవన్ కామెంట్స్ పై ఏపీ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. నోటీసులు పంపింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని.. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే మాటలు మహిళలను షాక్ కు గురి చేశాయని పేర్కొంది. పవన్ మాటల్లోని తప్పును తెలుసుకుని.. మహిళా లోకానికి సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేసింది.
Advertisement
కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. చేతనైతే మీరు చేసుకోండి అంటూ ఎలా మాట్లాడగలిగారు అంటూ మహిళా కమిషన్ ప్రశ్నించింది. ఇలా మాట్లాడితే మహిళల జీవితానికి భద్రత ఎలా ఉంటుందని అడిగింది. ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై పవన్ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని తెలిపింది కమిషన్. పవన్ ను ఫాలో అవుతున్న యువతకు చేతనైతే.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే సూచన చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది.
మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం ఆక్షేపణీయమన్న మహిళా కమిషన్.. ఆడవారిని భోగ వస్తువుగా.. అంగడి సరుకుగా భావించేవారు ఇలాంటి పదాలు వాడతారని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై అనేక మంది మహిళలు ఫిర్యాదు చేశారని.. తక్షణమే సమాధానం చెప్పాలని ఆదేశించింది. వెంటన్ పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.