Advertisement
ఒక పూట తినకుండా పస్తులు ఉంటారేమో కానీ ఒక నిమిషం ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేకుండా పోయింది. ఒకప్పుడు ఫోన్ అంటే గ్రామాల్లో అయితే ఎవరికో ఒకరికి మాత్రమే ఉండేది.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేసింది.. టీనేజ్ వచ్చిందంటే చాలు వారికి తప్పకుండా మొబైల్ ఫోన్ కొనాల్సిందే.. లేదంటే ఆ వ్యక్తి వెనుక పడిపోయినట్టే భావిస్తూ ఉంటారు.. అలా మొబైల్ ఫోన్ ను టీనేజ్ యువతీ యువకులను నుండి ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళ వరకు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు.. అయితే ఈ ఫోన్ లను కొన్ని మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది. కానీ ఈ ఫోన్ ల ద్వారా కొంతమంది యువకులు గేమ్స్ ఇతరాత్రా యాప్స్ లాంటి వాటి ద్వారా సమస్యల్లో పడుతున్నారు..
Advertisement
అయితే ప్రస్తుత కాలంలో ఒక సర్వే ప్రకారం ఫోన్ లేకుండా అమ్మాయిలు ఉండగలరా అబ్బాయిలు ఉండగలరా అనే దాన్ని బట్టి చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. మరి అవేంటో చూద్దాం.. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారం పై ఆధారపడి చాలా సమయం ఫేస్ బుక్,ఇంస్టాగ్రామ్, టిక్ టాక్,యూట్యూబ్ లాంటి యాప్స్ తో వేస్ట్ చేస్తున్నారు.. ఇందులో ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని సర్వే వెల్లడించింది. యూఎస్ లోని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. టీనేజ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు సోషల్ మీడియా ను వదిలి వేయడం చాలా కష్టమని చెప్పారట..
Advertisement
సోషల్ మీడియా ని వదులుకోవాలని ప్రశ్న వేసినప్పుడు 54% మంది టీనేజ్ వదులుకోవడం చాలా కష్టమని అన్నారు. మిగిలిన 46 శాతం మంది కనీసం కొంతవరకు హాయిగా ఉండవచ్చు అని సమాధానం కూడా ఇచ్చారట. సోషల్ మీడియా వదలడం కష్టమని చెప్పిన వారిలో 58% మంది టీనేజ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారట.. అంటే 15 శాతం టీనేజ్ అమ్మాయిలు ఫోన్ వదలడం కష్టమని చెప్పారు. టీనేజ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2014 నుంచి 15 లో 92 శాతం నుంచి ప్రస్తుతం 97 శాతానికి పెరిగిందని అధ్యయనం తెలియజేసింది.. అంటే ఈ మధ్యకాలంలో నిరంతరం ఆన్ లైన్ లో ఉండే టీనేజ్ వారి సంఖ్య దాదాపుగా రెండింతలు పెరిగిందన్నమాట..
Also read: ఈ 8 మందిని సినిమాల్లో హీరోయిన్ అనుకున్నారు.. కానీ చివరకు వేరే వారిని తీసుకున్నారు.. అవేంటంటే..?